విజయవాడలో దారుణం..ఐదేళ్ల కూతురి ఫై తండ్రి అత్యాచారం

ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఐదేళ్ల కూతురి ఫై తండ్రి అత్యాచారం చేసిన ఘటన సభ్య సమాజాన్ని తలెత్తుకుండా చేసింది. విజయవాడ లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీ మరియ వికాస్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పిడి గా పనిచేస్తున్న చినబాబు..ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమకు గుర్తుగా ఏడాదికే బిడ్డ పుట్టింది. ఇప్పుడు ఆ బిడ్డ కు ఐదేళ్లు.

అభం శుభం తెలియని ఆ ఐదేళ్ళ చిన్నారి తో లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు ఆ కసాయి తండ్రి. కూతురు బాగా ఏడువడం తో తండ్రి చేసిన అరాచకం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలియగానే భర్త చినబాబు పై దిశ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసింది చిన్నారి తల్లి. బాధితురాలి తల్లి ఫిర్యాదు తో పొక్సా చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది చిన్నారి.