త్రివిక్రమ్ టైటిల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల స్నేహం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ కు సంబదించిన అన్ని విషయాలు త్రివిక్రమ్ దగ్గరి ఉండి చూసుకుంటాడు. తన సినిమాలతో బిజీ గా ఉన్నప్పటికీ..పవన్ సినిమాలకు భాగం అవుతారు. ప్రస్తుతం మహేష్ తో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తూనే..మరోపక్క పవన్ – సాయి ధరమ్ తేజ్ – సముద్రఖని కలయికలో వస్తున్న సినిమా కు మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్న విషయం తెలిసిందే.

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తాలూకా షూటింగ్ పూర్తి కావడం తో మిగతా పనుల్లో డైరెక్టర్ సముద్రఖని ఉన్నారు. జులై 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ చక్కటి టైటిల్ ఫిక్స్ చేశారట. ఆ టైటిల్ గురించి పవన్ కళ్యాణ్ కు చెప్పడం తో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కాగా ఓ యువకుడు కారు యాక్సిడెంట్ లో మరణిస్తే దేవుడు అతనికి రెండో అవకాశం ఇస్తాడు. తమిళంలో ఇదే కాన్సెప్ట్ గా రాగా తెలుగులో సైతం ఇదే నేపద్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి మాటలు – స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందిస్తుండగా కేతికాశర్మ , ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.