ల‌ఖింపుర్ ఘ‌ట‌న‌లో విచార‌ణ‌కు హాజ‌రైన కేంద్ర మంత్రి కుమారుడు

క్రైం బ్రాంచ్ ఆఫీస్ కు వ‌చ్చిన ఆశిష్ మిశ్రా

ల‌ఖింపుర్‌: యూపీలోని లఖింపూర్ ఖేరి హింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర స‌హాయ‌ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఎట్ట‌కేల‌కు ఈ రోజు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఆయన పోలీసుల విచారణకు నిన్న గైర్హాజ‌రైన విష‌యం తెలిసిందే. ఈ రోజు కూడా విచార‌ణ‌కు రాక‌పోతే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సిట్ అధికారులు హెచ్చ‌రించారు. దీంతో ఆయ‌న విచార‌ణ‌కు వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌నను మీడియా ప‌లు ప్రశ్న‌లు అడ‌గ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా మాట్లాడ‌కుండానే క్రైం బ్రాంచ్ ఆఫీస్‌ లోప‌లికి వెళ్లారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రాను అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. కాగా, యూపీలోని లఖింపూర్ ఖేరి ఘ‌ట‌న‌లో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపింది. ఈ కేసులో ఇప్ప‌టికే ఎవ‌రినీ అరెస్టు చేయ‌క‌పోవ‌డంపై ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు మండిప‌డుతున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/