రష్యా టూర్ ముగించుకొని వచ్చిన భీమ్లా నాయక్

జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రష్యా టూర్ ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్నారు. క్రిస్మస్ , న్యూ ఇయర్ వేడుకల నిమిత్తం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో కలిసి కొద్దీ రోజుల కృత రష్యా కు వెళ్లారు. అక్కడ గ్రాండ్ గా వేడుకలు పూర్తి చేసుకొని హైదరాబాద్ కు తిరిగొచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయన వస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బ్లాక్ కలర్ టీషర్ట్, జీన్స్ లో ఆయన స్టైలిష్ లుక్ లో ఉన్నారు. ఇక ఈయన నటించిన భీమ్లా నాయక్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ , రాధే శ్యామ్ చిత్రాల రిలీజ్ కారణంగా ఫిబ్రవరి 25 కు వాయిదాపడింది. అయితే కరోనా , ఓమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతుండడం తో పలు రాష్ట్రాలు కరోనా ఆంక్షలు విధించాయి. వీకెండ్ లాక్ డౌన్ , థియేటర్స్ క్లోజ్ అవ్వడం జరిగాయి. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ , రాధే శ్యామ్ చిత్ర నిర్మాతలు తమ చిత్రాలను వాయిదా వేసుకున్నారు.