మీడియా ప్రతినిధులు వీపు వాయగొడతా అన్న మేయర్ రామయ్య ఫై లోకేష్ ఫైర్

మీడియా ప్రతినిధులపై కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య చేసిన వ్యాఖ్యల ఫై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ మంత్రులు చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర కర్నూలుకు వచ్చినప్పుడు… మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉందని ప్రజలు నీడ చాటుకు వెళితే… సభకు జనాలు రాలేదంటూ కొన్ని పత్రికలు పనికట్టుకుని ప్రచారం చేశాయని ఆయన మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాస్తే వీపులు వాయగొడతామని హెచ్చరించారు. బీవై రామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్నూలులో చర్చనీయాంశంగా మారాయి.

రామయ్య చేసిన వ్యాఖ్యలఫై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ సామాజిక న్యాయభేరీకి జనాలు రారని… అధికారులు బెదిరించి తెచ్చిన వారూ పారిపోతున్నారని లోకేష్ అన్నారు. ‘‘వాస్తవాలు రాసే, చూపించే మీడియా ప్రతినిధులు వీపు వాయగొడతారా మేయర్ గారు! ఇదేం రౌడీయిజం?. అధికారం మత్తులో నోరు పారేసుకోవద్దు. వీపులు మీడియా వాళ్లకే కాదు, మీకూ ఉంటాయి. ఎప్పుడు మీ వీపులు విమానం మోత మోగిద్దామా అని నాలుగు కోట్లకి పైగా ఉన్న ఏపీ ఓటర్లు ఎదురు చూస్తున్నారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు.