మహేష్ దంపతులకు క్రిస్మస్ గిఫ్ట్ పంపిన పవన్ కళ్యాణ్

సినీ నటుడు పవన్ కళ్యాణ్..సూపర్ స్టార్ మహేష్ దంపతులను ఆశ్చర్యానికి గురిచేసారు. క్రిస్మస్​ కానుకగా ఓ కస్టమైజ్​ గిఫ్ట్​తో పాటు గ్రీటింగ్​ కార్డును మహేష్ దంపతులకు..పవన్ దంపతులు పంపారు. ఈ విషయాన్ని నమ్రత తన ఇన్​స్టా లో పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా పవన్-అన్నా లెజెన్వాకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిస్మస్​ను సెలబ్రేట్​ చేసుకునేందుకు తన భార్య అన్నాతో కలిసి ​ ఇటీవల రష్యా వెళ్లారు. ఈ పండగ పూర్తయిన తర్వాత మళ్లీ తిరిగి స్వదేశానికి రానున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్’ సినిమా చేస్తున్నారు. సంక్రాంతి రేసు నుంచి తప్పుకొన్న ఈ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది. ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్​తోపాటు రానా కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నిత్యామేనన్, సంయుక్త హెగ్డే హీరోయిన్లు. తమన్ సంగీతమందించగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తుండడం విశేషం.