ఆర్ఆర్ఆర్ నుండి కొముర‌మ్ భీముడో సాంగ్ రిలీజ్

యావత్ తెలుగు సినీ ప్రపంచం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తీసిన ‘ఆర్ఆర్ఆర్’లో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​ పాత్రలు పోషించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందీ.

ఈ క్రమంలో చిత్ర యూనిట్ పలు భాషల్లో ప్రమోషన్ కార్య క్రమాలు చేస్తూ సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేస్తున్నారు. ఇప్పటికే చిత్రంలోని మూడు సాంగ్స్ విడుదల చేసి ఆకట్టుకున్న మేకర్స్..శుక్రవారం చిత్రంలోని కొముర‌మ్ భీముడో అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేసారు. ఈ సాంగ్ తో ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పాటలో తార‌క్ ఎక్స్ ప్రెష‌న్స్ పీక్స్ లో ఉన్నాయి. అలాగే పాట లిరిక్స్ తో పాటు కీర‌వాణి మ్యూజిక్ కూడా అద్భ‌తంగా ఉంది.

YouTube video