మోడీ ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఐ నారాయణ

ప్రధాని మోడీ ఫై సీపీఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేసారు. గంగమ్మ జాతరకు బలిచ్చే మేకను పోషించినట్టు రైల్వే ని ఆధునికరిస్తున్నారు…ఆ తరువాత అవి అమ్మేస్తారు అని మండిపడ్డారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో సీపీఐ , సీపీఐ (ఎం) పార్టీలు ఉమ్మడి సమావేశం నిర్వహించాయి. మండల స్థాయి నుంచి రాష్ట్ర నాయకుల వరకు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మోడీ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించాయి. దీనికి కలిసి వచ్చే పార్టీలతో జత కడుతామని ప్రకటించారు. తెలంగాణలో క్షేత్రస్థాయిలో కలిసి పని చేయాలని ఓ నిర్ణయానికి వచ్చాయి. అనంతరం సీపీఐ (ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి , సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, నారాయణ మాట్లాడుతూ మోడీ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘రాజ్యాంగాన్ని.. ఈడీ, సీబీఐ సంస్థల్ని మోదీ దుర్వినియోగం చేస్తున్నాడు’ సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు.

‘భాగ్యలక్ష్మి ఆలయ నగరం నుంచి వేంకటేశ్వరస్వామి నగరానికి వందేభారత్ రైలు వెళ్తోందని మోడీ చెప్పి రైలుకు కూడా మతం రంగు పులుముతారా?’ అని సీపీఐ(ఎం) పోలిటిబ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు నిలదీశారు. ‘మోడీ దేశాన్ని అమ్మేస్తారు. సికింద్రాబాద్, విజయవాడ స్టేషన్లను ప్రైవేటుకు అప్పగించేస్తారు’ అని నారాయణ అన్నారు. ‘జగన్ పై ఆర్థిక దోపిడీ సహా అనేక కేసులు ఉన్నాయి. హత్య ఆరోపణలు ఉన్నాయి. అందుకే ప్రధాని మోడీకి జగన్ మద్దతు ఇస్తూ జైలుకు వెళ్లకుండా ఉన్నాడు. కేసీఆర్ మోడీని వ్యతిరేకిస్తున్నందుకే కవితను జైలుకు పంపేందుకు మోడీ ప్రయత్నిస్తున్నాడు’ అని నారాయణ అన్నారు.