ఎంపీ రఘురామ అరెస్టుపై పవన్ కల్యాణ్ ఆగ్రహం
కరోనా బాధితుల చికిత్సపై ప్రభుత్వం దృష్టి సారించాలి

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలను రక్షించవలసి ఉండగా.. ఎంపీ రఘురామకృష్ణరాజు రాజును అరెస్టు చేయడం ఏమాత్రం సమర్ధింపు చర్య కాదని అన్నారు. ప్రభుత్వాన్ని తరుచు తీవ్రంగా విమర్శిస్తున్నారనే కారణంతో ఎంపీని సమయం, సందర్భంగా లేకుండా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఒక్క పక్క ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందని పరిస్థితులు నెలకొన్నాయని , ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రజల బాధలపై దృష్టి పెట్టాలని, ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించి అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని పేర్కొన్నారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/