నియంత సైకో జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌: లోకేష్ విమర్శ

ప్రజల ప్రాణాలను పట్టించు కోకుండా ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి

Nara Lokesh
Nara Lokesh

Amaravati: నరసాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో నియంత పాలన సాగుతోందని ఆయన దుయ్య బట్టారు. ప్ర‌జ‌ల ప్రాణాల ర‌క్ష‌ణ ప‌ట్టించుకోకుండా, త‌న కక్ష సాధింపు చర్యలకు ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్న ఏకైక మూర్ఖ‌పు ముఖ్య‌మంత్రి జగన్ అని వ్యాఖ్యానించారు.ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుని అరెస్ట్ చేస్తే, జ‌గ‌న్ రెడ్డి స‌ర్కారుపై విశ్వాసం లేద‌ని 5 కోట్ల ఆంధ్రులూ బ‌హిరంగంగానే ప్ర‌క‌టిస్తున్నారని పేర్కొన్నారు. వారంద‌రినీ అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు ‘’ప్ర‌శ్నిస్తే సీఐడి అరెస్టులు, ఎదిరిస్తే ఏసీబీ దాడులు, వైసీపీలో చేర‌క‌పోతే జేసీబీతో ధ్వంసం,లొంగ‌క‌పోతే పీసీబీ త‌నిఖీలు.ఇదీ నియంత సైకో జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌’’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/