నేడు సీఎం జగన్ పోలవరం పర్యటన

ఏపీ సీఎం జగన్ నేడు పోలవరం ను పరిశీలించనున్నారు. దీనికి సంబదించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఉదయం 10.15 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. పోలవరం ప్రాజెక్టు లోయర్‌, అప్పడర్‌ కాఫర్‌ డ్యామ్‌లను జగన్‌ పరిశీలించనున్నారు. స్పిల్‌ వే, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ ప్రాంతాలను కూడా సందర్శించనున్నారు. ప్రాజెక్టు పనుల పరిశీలన తర్వాత.. జలవనరుల శాఖ అధికారులు, ఇంజినీర్లతో జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.

గతసారి సీఎం వచ్చినప్పటి నుంచి.. ఇప్పటి వరకు జరిగిన పనులను వివరించనున్నారు. అయితే.. వర్షాకాలం మరో వారం పది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సమయంలో ప్రాజెక్టు వద్ద తీసుకోవాల్సిన చర్యలను కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించే అవకాశం ఉంది. సమీక్షా పూర్తి కాగానే మధ్యాహ్నం అక్కడ నుంచి తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు.