వర్మ ఫై నాగబాబు పంచ్

మెగా బ్రదర్ నాగబాబు వర్మ ఫై పంచ్ లేసారు. వర్మ తెరకెక్కించిన వ్యూహం మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జగన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా చేసారు. అయితే ఈ సినిమాలో చంద్రబాబు , లోకేష్ , పవన్ కళ్యాణ్ లను కించపరిచే విధంగా సన్నివేశాలు చేసారని జనసేన, టిడిపి ఆరోపిస్తూ సినిమా విడుదలను నిలిపివేయాలని హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసారు. ఇదే తరుణంలో మూవీ రిలీజ్‌పై అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు ఓ టీవీ ఛానల్‌లో మాట్లాడుతూ తన సినిమాలతో వర్మ సమాజానికి కంటకంగా మారాడని వ్యాఖ్యానించారు. వర్మ తల నరికి తెచ్చిన వారికి కోటి రూపాయల బహుమతి కూడా ఇస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో వర్మ..ఏపీ డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.

దీనిపై నాగబాబు స్పందించారు.‘‘ఆర్జీవీ గారిపై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు.. నేను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్జీవీ గారూ మీరేం భయపడకండి. మీ జీవితానికి ఏ ఢోకా లేదు. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఏపీలో.. ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికిమాలిక వెధవా మీకెటువంటి హానీ తలపెట్టడు. ఎందుకంటే హీరో, విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్‌ గాడ్ని ఎవడూ చంపడు కదా! మీరేం వర్రీ అవకండి. నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి’’ అని పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా చక్కర్లు కొడుతోంది.