మూడు పెళ్లిళ్ల ఫై అన్‌స్టాపబుల్ షో లో పవన్ క్లారిటీ

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ప్రత్యర్థి పార్టీలు నిత్యం మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకొస్తుంటారు. అయితే పలుమార్లు పవన్ మూడు పెళ్లిళ్ల ఫై స్పదించినప్పటికీ , వారు మాత్రం వారి కామెంట్స్ ను ఆపడం లేదు. తాజాగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో మరోసారి పవన్ మూడు పెళ్లిళ్ల ఫై క్లారిటీ ఇచ్చారు.

బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ రెండో సీజన్ ఆఖరి ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేసిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ తొలి భాగం నిన్న ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి వచ్చింది. ఫస్ట్ పార్ట్ ఎంతో సరదాగా సాగింది. పవన్ కళ్యాణ్‌ను భయ్యా అంటూ బాలయ్య పిలుస్తూ సందడి చేసారు.

‘పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా’ అని చాలా సింపుల్‌గా బాలయ్య అడిగేసినా.. పవన్ కళ్యాణ్ మాత్రం చాలా క్షుణ్ణంగా వివరణ ఇచ్చారు. ‘‘జీవితంలో అసలు పెళ్లే చేసుకోకూడదు అనుకున్నా. బ్రహ్మచారిగా ఉండిపోవాలి.. యోగామార్గంలోకి వెళ్లాలి అనుకున్నా. కానీ, నా జీవిత ప్రయాణం చూసుకుంటే.. నేనేనా.. నాకేనా ఇన్నిసార్లు జరిగాయి అనిపిస్తుంది. ఏదీ నేను ప్లాన్ చేయలేదు. నేను ఎప్పుడూ చాలా సంప్రదాయబద్ధంగా బతికే వ్యక్తిని. ఫస్ట్ నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు చాలా సంప్రదాయబద్ధమైనది, ఇంట్లో వాళ్లు చూసింది. రిలేషన్‌షిప్‌లో కొన్ని కుదరవు కాబట్టి విడిపోతారు. రెండోసారి పెళ్లిచేసుకున్నప్పుడు ఏకాభిప్రాయం రాకో.. వేరే ఏదో కారణంతో విడిపోయాం. ప్రతీసారి మూడు పెళ్లిళ్లు అంటుంటే.. ముగ్గురినీ ఒకేసారి చేసుకోలేదురా బాబు, ముగ్గురితో ఒకేసారి ఉండట్లేదు, ఒక వ్యక్తితో కుదరలేదు ఇంకోసారి చేసుకోవాల్సి వచ్చింది. ఆ వ్యక్తితో కుదరలేదు ఇంకోసారి చేసుకున్నాను. నేనేదో కోరుకొనో వ్యామోహంతో చేసుకోలేదు, జరిగాయంతే’’ అని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి విమర్శించడానికి అదొక ఆయుధంలా అయిపోయిందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ‘నేను ఏమనుకుంటానంటే.. ఎవరో ఒకళ్లు ఏదో ఒకటి తిట్టాలి కాబట్టి పర్లేదులో తిట్టుకోనియ్ అనుకుంటాను. లోపల నాకు ఎలాంటి తప్పుచేశాననే భావన లేదు’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఫైనల్ గా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘పవన్ కళ్యాణ్‌ను అనడానికి ఏముంది. క్లియర్ ఉంటాడు.. స్ట్రయిట్ ఫార్వాడ్‌గా ఉంటాడు. ఏదో ఒకటి అనాలి. అతని సమర్థతను కవర్ చేయడం కోసం ఏవో పిచ్చి మాటలు మాట్లాడాలి. భయ్యా.. ఈ స్టేజ్ మీది నుంచి నేను ఒక ప్రకటన చేస్తున్నాను. ఇందుమూలంగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయనిది ఏమనగా.. ఇంకొక్కసారి ఆయన గురించి, పెళ్లిళ్ల గురించి మాట్లాడితే మీరు ఊరకుక్కలతో సమానం’’ అని తెలిపారు.