నిర్భయ దోషులను ఆప్‌ రక్షించాలని చూస్తోంది

దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం కావాలనే న్యాయప్రక్రియను ఆలస్యం చేసింది

Manoj Tiwari
Manoj Tiwari

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడకుండా ఉద్దేశపూర్వకంగానే ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఢిల్లీ బిజెపి చీఫ్‌ మనోజ్‌ తివారీ విమర్శించారు. దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం కావాలనే న్యాయప్రక్రియను ఆలస్యం చేసిందని మనోజ్‌ తివారీ ఆరోపించారు. ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2017లో ఉరిశిక్ష విధిస్తే 2019 వరకు సమాచారం ఇవ్వకుండా ఆలస్యం చేశారని తివారీ దుయ్యబట్టారు. ఇప్పటి వరకు న్యాయ ప్రక్రియను అడ్డుకున్న ఆప్‌ ప్రభుత్వం ఇప్పుడు వారిని రక్షించాలని చూస్తోందని పేర్కొన్నారు. నిర్భయ నిందితులను క్షమించాలని ఆమె తల్లి ఆషాదేవిని సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ కోరడాన్ని తివారీ తప్పుబట్టారు. ఇందిరా జైసింగ్‌ ఆప్‌కు చెందిన వ్యక్తేనని అందరికీ తెలుసన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/