Auto Draft

పండుగలు విశిష్టత

Bathukamma is a symbol of tradition

బతుకమ్మ అంటేనే ఆడబిడ్డలను గౌరవించుకునేటటువంటి తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేది. ఆచార వ్యవహారాలను కనుమరుగుకాకుండాచేసేంది. ఐక్యతను పెంచేటటువంటి జీవన విధానాన్ని అలవాటుచేసేది.

కుటుంబ సంబంధాలను తెలిపే జీవన విధానం నుండి వచ్చిన అచ్చ తెలుగువారి పండుగ బతుకమ్మ. ఇది ప్రకృతి పర్యావరణానికి సంబంధించిన పండుగ.

సహజసౌందర్యానికి ప్రతిక బతుకమ్మ అలంకరణ ఎంత కళాత్మకంగా ఉంటుందో అంత శమ్రతో కూడుకుని ఉన్నదే.

బతుకమ్మను పేర్చడానికి పిల్లలు, పెద్దలు, ఆడమ, మగ అందరూ కష్టపడాల్సిందే పూలమీదపూలు పెట్టి వరుస మీద వరుస పెట్టి ఎత్తుయిన బతుకమ్మను తయారుచేస్తారు.

ప్రతియేటా బతుకమ్మ పండుగ వస్తోందంటే చాలు ఇప్పుడు బతుకమ్మ చరిత్రను సంబంధించి ఏటేటా పదుసంఖ్యల్లో పాటలు విడుదలవుతున్నాయి. అక్కాచెల్లెలను హుషారెత్తిస్తున్నాయి.

బతుకమ్మను తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలు నివేదించి సత్తుపిండి, సలివిడి, మలిద ముద్దలను ప్రసాదంగా పెట్టి ఊరి చెరువుల్లోకి సాగనంపుతారు.

ఆడుతూ పాడుతూ సాగే బతుకమ్మను నీళ్లలోకి సాగనంపేముందు గౌరమ్మగా భావిస్తూ పూజచేస్తారు.

గంగమ్మ చెంతకు గౌరమ్మను సాగనంపుతారు. ఈ సద్దుల బతుకమ్మ ఆటతో అలిసినవారికి శక్తి, ఆనందం ఇచ్చేందుకు రుచికే కాకుండా బలానికి కూడా ప్రాధాన్యతనిస్తారు.

సద్దుల బతుకమ్మను సాగనంపడమంటే ఆడబిడ్డను అత్తారిం టికి సాగనంపడమే.

ఉన్నంతకాలం ప్రేమతో చూసు కొన్న అమ్మాయిని/కూతురిని అత్తగారింటికి పంపించే క్రమంలో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని, బుద్ధిమాటలు చెప్పి పంపిస్తారో 9 రోజులు బతు కమ్మ ఆడి సద్దుల బతుకమ్మనాడు అంత ప్రేమతో గౌరమ్మను గంగమ్మ ఒడికి చేర్చడమే సద్దుల బతుకమ్మ ఉత్సవం.

సద్దుల బతుకమ్మ తెంటాణకు ఒక ‘ఐకాన్‌ తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్రా భాషా సాంస్కృతిక శాఖ బతుకమ్మ సంబురాలు వేడుకను నిర్వహించే బాద్యతనుతీసుకుంటుంది. ఎల్‌.బి.స్టేడియం మహిళ లతో నిండిపో తుంది. టాంక్‌బండ్‌ పట్టచాల నంతగా మారుతుంది. వాగులు, చెరువులు నిండిపోతాయి.

గడిచినపోయిన ఎనిమిది రోజుల మాదిరిగా కాకుండా చివరి రోజయిన సద్దుల బతుకమ్మనాడు ప్రతి ఒక్కరూ పోటీపడి పూలను సేకరించి పెద్ద పెద్ద బతుకమ్మలను పేరుస్తారు.

నగరాల్లో ఎంతయినా తక్కువేకానీ గ్రామాల్లో తంగేడు. గునుగు, అల్లి, తామరలు ఎన్నో రకాల పూలు లభిస్తాయి.

ఇవేకాకుండా ఈ మధ్య కాలంలో టేకుపూలతో బతుకమ్మలను పేరుస్తున్నారు.

వీటితో పేర్వడంవల్ల బతుకమ్మలు బరువు తక్కువగా ఉంటాయి. చాలా పెద్దగా/ఎత్తుగా కనిపిస్తాయి. నగరాల్లోనయితే సద్దుల బతుకమ్మను పేర్చడంకోసమని వందల రూపా యలు ఖర్చుచేసి పూలుకొంటారు.

బతుకమ్మను తెలుగురాష్ట్రంల్లో (ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం)నే కాకుండా విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

విదేశాల్లో ఉండేవారంతా దగ్గర దగ్గరగా ఉన్నవారు ఒక్కచోటకుచేరుకుని సద్దుల బతుకమ్మను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ తెలుగువారి గొప్పతనాన్ని, భారదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెబుతున్నారు.

ప్రభుత్వాలు కూడా రాష్ట్ర పండుగలుగా గుర్తించి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నాయి.

ఇలాంటి ఆచార వ్యహారాలను మరిచిపోకుండా ఉండాలంటే మనముందు తరాలవారికి సంస్కృతి, సంప్రదాయాల గురించి చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పడం ప్రతి ఒక్కరి బాధ్యతగానే భావించాలి.

లేకుంటే చరిత్రలో కొంతకాలానికి కనుమరుగైపోతాయి. బతుకమ్మను తొమ్మిది రోజులు కూడా కలిసి ఆడతారు.

కానీ చివరి రోజయినటువంటి సద్దుల బతుకమ్మ రోజు మాత్రం అందరూ కలిసి ఒకే దగ్గరకు చేరి ఊరంతా చెర్వు గట్లుకు చేరుకుని బతుకమ్మను ఆటాపాడలతో ఆడుతుంటే అక్కడ ఒక ఉత్సవ వాతావరణం కన్పిస్తుంది.

ఎవరికున్నంతలోవారు ఖరీదయిన చీరలు, నగలు వేసుకొన ఆడుతుంటే చూడటానికి కళ్లుచాలవు. స్త్రీలందరూ మైమరచి పోయి ఎంతో ఉత్సాహంతో, కోలాలు వేస్తూ పాటలను పాడుతారు.

ఇప్పుడు డిజేలు పట్టి బతుకమ్మలు ఆడుతున్నారు. సద్దుల బతుకమ్మకు సంబంధించి పాటలే ప్రాణం.

సద్దులరోజు అందరి బతుకమ్మలు ఒకదగ్గరపెట్టి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. బతుకమ్మ పాటలన్నీ కూడా ప్రజల జీవనాన్ని గురించి చెప్పేవే.

తరువాత నీటిలో బతుకమ్మను వేస్తూ వెళ్లిరా అమ్మా మళ్ళీ సంవత్సరం రా అంటూ వేస్తారు.

తరువాత మహిళాలందరు ఒక్కరికి ఒక్కరు తాము బతుకమ్మతో తెచ్చిన ప్రసాదాలు పంచుకుంటారు. అవితింటూ వారి వారి ఇంట్లోకి చేరుకుంటారు.

  • సుమశ్రీ

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/