షణ్ముఖ్ – సన్నీ ల మధ్య గొడవ పెట్టిన సిరి..నువ్వెంత..నువ్వెంత అంటూ కొట్టుకునేవరకు వెళ్లారు

bigg bo

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏంజరుగుతుందో ఎవరికీ తెలియదు. అప్పటివరకు నవ్వుకుంటూ హ్యాపీ ఉన్న హౌస్ సభ్యులు..అంతలోనే గొడవకు దిగుతారు. గత రెండు రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో బిగ్ హోటల్ టాస్క్ జరిగింది. ఈ టాస్క్ లో ప్రతి ఒక్క సభ్యుడు ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేసారు. ఇక ఈరోజు కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఓ గేమ్ నిర్వహించారు. టవర్ లో ఉంది పవర్, అనే ఈ టాస్క్ లో కొందరు బ్లాక్స్ తో టవర్ నిర్మిస్తుంటే, వారి ఆపోజిట్ టీం సభ్యులు బాల్స్ తో దాన్ని కూల్చే ప్రయత్నం చేయాలి. ఈ టాస్క్ లో తనని ఆడకుండా సిరి అడ్డుపడడంతో సన్నీ పెద్ద ఎత్తున ఫైర్ అయ్యాడు. దీనికి ‘ఇది నా గేమ్‌ స్ట్రాటజీ’ అని సిరి బదులివ్వగా.. ఇలాగే చేస్తే ‘ తంతాను.. అప్పడమైపోద్ది’ అని సన్నీ ఫైర్ అయ్యాడు. ‘అయితే…వెళ్లి అప్పడాలు అమ్ముకో’ అంటూ సిరి సన్నీని ఎగతాళి చేస్తుంది. అక్కడితో అయిపోతుంది అనుకున్నారు కానీ అది మరింత ముదిరింది. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉండగా మధ్యలో ఎంటర్ అయిన షణ్ముఖ్‌ సిరికి సపోర్ట్‌గా మాట్లాడతాడు.

దీంతో సన్నీ, షణ్ముఖ్ మధ్య గొడవ రాజుకుంటుంది. ‘నువ్వు సిరిని ఏం చేయలేవు’ అని షణ్ముఖ్‌ అంటే…’ ఏం..సిరిని కొడితే చూడాలని ఉందా? అలా చేయడానికి నాకు క్షణం పట్టదు అంటూ సన్నీ ఫైర్ అయ్యాడు ఆడపిల్లలను పంపించి మాట్లాడడం కాదు. దమ్ముంటే నీ ఆట నువ్వు ఆడాలి.. ఆడపిల్లల సహాయంతో గేమ్‌ ఆడొద్దు’ అని సన్నీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో షణ్ముఖ్‌ కూడా రెచ్చిపోయాడు. మరి ఈ గొడవ ఇంతటితోనే ఆగుతుందా..ఇంకా పెద్దది అవుతుందా అనేది ఈరోజు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది.