భారత పర్యటన .. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాణిజ్య అంశాల్లో భారత్ సరిగ్గా వ్యవహరించట్లేదు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో మంగళవారం విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మున్ముందు భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం ఉంటుందని చెప్పారు. అయితే, అధ్యక్ష ఎన్నికల లోపు ఒప్పందం కుదురుతుందో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. ఇరు దేశాలకు మరిన్ని లాభాలు చేకూర్చేలా ఒప్పందం ఉండడం కోసం ప్రస్తుతానికి దీన్ని పక్కనబెట్టే అవకాశాలున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. వాణిజ్య అంశాల్లో భారత్ తమతో సరిగ్గా వ్యవహరించట్లేదని ఆయన చెప్పారు. భారత ప్రధాని మోడి అంటే తనకెంతో ఇష్టమని వ్యాఖ్యానించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/