కరోనా లక్షణాలు తగ్గిపోయాయి ..

సిఏం కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎం.వి రావు స్పందన

TS CM Kcr
TS CM Kcr

Hyderabad: తెలంగాణ సిఏం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ నేపథ్యంలో ఫామ్ హౌస్ లో చికిత్స తీసుకుంటున్నవిషయం తెలిసిందే. ఇదిలావుండగా , కొన్ని పరీక్షల నిమిత్తం ఆయన యశోద ఆసుపత్రికి వచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి వ్యక్తిగత వైద్యుడు ఎం వి రావు స్పందించారు. సీఎంకు సిటీ స్కాన్ చేశామని, . ఊపిరితిత్తులలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని అన్నారు. అన్ని నార్మల్ గానే ఉన్నాయి. కరోనా లక్షణాలు అన్నీ కూడా పోయాయని తెలిపారు. సీఎం కేసీఆర్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని , త్వరలోనే విధులకు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. కాగా రక్తపరీక్ష లకు సంబంధించిన ఫలితాలు రేపు వస్తాయి అని పేర్కొన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/