తెలంగాణ లో ఆర్టీసీ బస్సుల రంగులు మారబోతున్నాయి

100-percent-city-buses-on-road-from-today-in-hyderabad

ప్రయాణికులను ఆకర్షించేందుకు TSRTC సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల రంగులు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా సిటీ బస్సుల రంగు మార్చాలని ఆర్టీసీ భావిస్తోంది. చాలాకాలంగా ఒకే రంగుతో ‘పాతబడ్డ’ బస్సులకు కొత్త రంగులతో కొత్త లుక్‌ తేవాలని కొత్త ఎండీ సజ్జనార్‌ భావిస్తున్నారు.

గతంలో నగరంలో ఆకుపచ్చ, పెసర రంగులతో సిటీబస్సులు ప్రత్యేకంగా కనిపించేవి. 15 ఏళ్ల క్రితం దినేశ్‌రెడ్డి ఆర్టీసీ ఎండీగా ఉన్న సమయంలో బస్సుల రంగులు మార్చారు. అప్పటి వరకు ఎర్ర బస్సు అన్న పేరుతో ఆర్టీసీ ఆర్డినరీ బస్సులు ప్రత్యేకంగా గుర్తింపు పొందాయి. పల్లెలు పచ్చదనంతో మెరిసిపోయే తరుణంలో, బస్సులు కూడా దాన్ని ప్రతిబింబించేలా ఉండాలన్న ఉద్దేశంతో రంగులు మార్చారు. అందుకే పల్లెవెలుగు బస్సులు ఆకుపచ్చ రంగుతో ఉంటున్నాయి. దశాబ్దంనరపాటు ఆ రంగు చూసి జనానికి బోర్‌ కొట్టి ఉంటుందన్న భావన ఇప్పుడు వ్యక్తమవుతోంది. అందుకోసం జనాన్ని ఆకట్టుకునే రంగుల్లోకి వాటిని మార్చాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని రంగులు అనుకున్నారు. వాటితో ట్రై చేసి ఏది బాగుంటే అది ఫైనల్ చేసి బస్సులకు వేయాలని చూస్తున్నారు.