వైరల్ పిక్ : మీడియా ను ముందు పెట్టి సేద తీరుతున్న పాల్..

మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఓ ఊపు ఊపేస్తోంది. ఓటర్లను కొనుగోలు చేయడమే కాదు నేతలను సైతం కొనుగోలు వ్యవహారాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం అన్ని పార్టీల నేతలు గత కొద్దీ రోజులుగా మునుగోడు నియోకవర్గం లో ప్రచారం చేస్తూ వస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు మద్యం, బిర్యాని , డబ్బు ఇలా అన్ని ఇస్తూ వస్తున్నారు. అయితే ఈ ఉప ఎన్నిక ప్రచారంలో అన్ని పార్టీల నేతలు ఒకెత్తు, కేఏ పాల్ ప్రచారం ఒకెత్తు.

రోజుకో వెరైటీ ప్రచారంతో కేఏ పాల్‌ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఓ చోట తీన్మార్‌ స్టెప్స్ వేస్తాడు..మరో చోట సెలూన్‌కుకెళ్లి హెయిర్ కటింగ్ చేయించుకుంటాడు..ఇంకో దగ్గర చెప్పులు కుడుతూ హల్చల్‌ చేస్తాడు.. కొంత మంది ఓటర్లకు స్వీట్లు, వాటర్ బాటిళ్లు పంచడం.. స్వయంగా చాయ్ పెట్టి ప్రజలకు పోయడం.. రైతు మాదిరిగా వేషం కట్టి చేలో పత్తి తీయడం ఇలా ఏదొకటి చేస్తే వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. తాజాగా మీడియా లోగోలు తన ముందు టేబుల్‌పై పెట్టగా.. ఆ పక్కనే ఉన్న కుర్చీలపై పడుకుని సేద తీరుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ పిక్ చూసిన వారంతా పాల్ అంటే పాలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.