“ఇక్కడ వారు లేరు కదా!” అంటూ గరికపాటి గుర్తుచేసిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి ఎవరైనా వెళ్తే..ముందుగా గరికపాటి ని గుర్తుచేసుకుంటున్నారు. ఎందుకో అందరికి తెలిసిందే. ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో చిరంజీవి ఫై ఆగ్రహం వ్యక్తం చేసి గరికపాటి వార్తల్లో నిలిచారు. ఇప్పుడిప్పుడే మెగా అభిమానులు ఈ ఇష్యూ ని మరచిపోతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి మరోసారి ఈ ఇష్యూ ను గుర్తు చేయకనే గుర్తు చేసారు.

శుక్రవారం ప్రముఖ జనరలిస్ట్ ప్రభు పుట్టిన రోజు సందర్బంగా ఏర్పటు చేసిన ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా చిరంజీవి హాజరయ్యారు. ఫంక్షన్ కు వచ్చిన వారంతా చిరంజీవితో ఫొటోల కోసం పోటీ పడ్డారు. దాంతో చిరంజీవి స్పందిస్తూ “ఇక్కడ వారు లేరు కదా!” అంటూ అనుమానంగా అడిగారు. చిరంజీవి చమత్కారాన్ని అర్థం చేసుకున్న అక్కడివారు చప్పట్లతో హోరెత్తించారు. అనంతరం, వారు “లేరు” అని చెప్పడంతో, చిరంజీవి ఛాతీపై చేయి వేసుకుని “హమ్మయ్య” అంటూ రిలీఫ్ గా ఫీలవుతున్నట్టు ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. “ఇక రండమ్మా” అంటూ అక్కడున్న మహిళలను ఫొటోలకు దిగారు. ప్రస్తుతం చిరు అన్న మాటలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తం మీద మరోసారి గరికపాటి చిరు గుర్తు చేసారు.