అమెరికాలో మళ్లీ కరోనా విజృంభణ

ఒక్కరోజే 50 వేలకు పైగా కేసుల నమోదు

america- coronavirus

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. గడిచిన 24 గంటల్లో 50 వేలకు పైగా కేసులు నమోదు కావడం వరుసగా ఇది రెండోరోజు. ఇక, దేశంలోని 50 రాష్ట్రాల్లో 40 కరోనా బారినపడి విలవిల్లాడుతున్నాయి. తాజాగా నమోదైన 55 వేల కేసుల్లో 25 వేలు ఆరిజోనా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్ రాష్ట్రాల్లో నమోదు కావడం గమనార్హం. కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.10 కోట్ల మంది కరోనా బాధితులుగా మారగా, ఇప్పటి వరకు 5.26 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, తొలి నుంచీ కరోనాను తేలిగ్గా తీసుకున్న బ్రెజిల్‌లో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో32,107 మంది కరోనా బారినపడ్డారు. 990 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆ దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 15 లక్షల మార్క్ దాటిపోయింది. ఇక, రష్యాలో 6,718, పాకిస్థాన్‌లో 4,193, దక్షిణాఫ్రికాలో 8,728 మందికి కొత్తగా వైరస్ బారినపడ్డారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/