కృష్ణా జిల్లాలో వైస్సార్సీపీ పార్టీ కి భారీ షాక్..కీలక నేత రాజీనామా

మరో ఏడు, ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏ పార్టీ లో ఉంటె బెటర్..ప్రజలు ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు..ఏ పార్టీ లో చేరితే తమ రాజకీయ భవిష్యత్ బాగుంటుందనేది నిర్ణయించుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో అధికార పార్టీ నుండి పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ కి సపోర్ట్ చేసి ఆ పార్టీ విజయంలో భాగమయ్యారు.

అలాగే మరికొంతమంది వారి అసమ్మతిని తెలియజేస్తూవస్తున్నారు. ఇదిలా ఉంటె తాజాగా కృష్ణా జిల్లాలో వైస్సార్సీపీ కి భారీ షాక్ తగిలింది. అవనిగడ్డ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న పరుచూరి సుభాష్ చంద్ర బోస్ పార్టీకి రాజీనామా చేసారు. ప్రజలకు న్యాయం జరగడం లేదని.. ప్రభుత్వ విధానాలతో విసిగి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని.. ఆ తర్వాత వైస్సార్సీపీ లోకి వచ్చానని తెలిపారు. గతంలో కొందరు నేతలు తనను జగన్ పార్టీలోకి వెళ్లొద్దని చెప్పినా వినలేదని.. వైఎస్‌ రాజశేఖరరెడ్డిలాగే జగన్ కూడా పాలన అందిస్తారని నమ్మాను అన్నారు. కష్ట కాలంలో వయోభారంతో ఉన్నప్పటికీ తాను జగన్‌మోహన్‌ రెడ్డి వెంట 3,649 కిలోమీటర్లు పాదయాత్రలో పాల్గొన్నాను అన్నారు. కానీ రాష్ట్రంలో పరిణామాలతో పాటూ ప్రభుత్వ పాలన నచ్చలేదని.. అందుకే పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ప్రజావేదిక కూల్చటం, రాజధాని తరలింపు వంటి నిర్ణయాలు తీసుకున్నప్పటి నుంచే తనకు బాధ కలిగిందన్నారు. అప్పటి నుంచి తాను పార్టీకి కాస్త దూరంగా వస్తున్నాని, ఇక ఇప్పుడు పార్టీ నుండి బయటకు వచ్చానని తెలిపారు.