మా నాన్న సూపర్ స్టార్ అంటూ చంద్రబాబు కు లోకేష్ విషెష్

తెలుగుదేశం పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా పార్టీ నేతలు , కార్య కర్తలు పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నారు. పలు సేవ కార్య క్రమాలు చేపడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియా లోను సినీ , రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెష్ అందజేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే.. తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు నారా లోకేష్‌. మా నాన్న సూపర్ స్టార్..అందరి ధైర్యం అని ట్వీట్‌ చేశారు. జన్మనిచ్చేవారే కాకుండా చదువు చెప్పేవారు, అన్నం పెట్టిన వారు, భయాన్ని పోగొట్టేవారు కూడా తండ్రితో సమానం అని చాణక్యుడు అన్నారు. ఇక తెలుగువారికి ఆయనంటే ఒక భరోసా అని…లక్షలాది తెలుగుదేశం సైనికులకు ఆయనే ఒక ధైర్యం అని కొనియాడారు. ఈ రకంగా కోట్లాది మందికి తండ్రి అయ్యారు ఆయన… సొంత కుటుంబం కోసం కాకుండా, తెలుగు జాతినే కుటుంబం చేసుకుని, ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే నా సూపర్ స్టార్… ఆయనే మా నాన్న చంద్రబాబు గారు అంటూ ట్వీట్‌ చేశారు నారా లోకేష్‌.