యశోద మూవీ ఫై ఆలస్యంగా స్పందించిన పరుచూరి గోపాల కృష్ణ

స్టార్ రైటర్ గోపాల కృష్ణ సమంత నటించిన యశోద మూవీ ఫై స్పందించారు. వాస్తవానికి యశోద మూవీ విడుదలై చాల రోజులే అవుతున్నప్పటి..రీసెంట్ గా పరుచూరి తన స్పందనను తెలియజేసారు. హ‌రీష్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ సంయుక్తంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున నవంబర్ 11 న విడుదలైంది. మొదటి రోజు మొదటి ఆటతోనే అభిమానులు, సినీ ప్రముఖులు , విమర్శకులు ఇలా సినిమా చూసిన వారంతా సమంత నటన ఫై ప్రశంసలు కురిపించారు.

తాజాగా ఈ సినిమాపై సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. సినిమాలో సమంత నటన అద్భుతమని , దర్శకులు హరి, హ‌రీష్‌లు సమంత పాత్రను తీర్చిదిద్దిన తీరు చాల బాగుందని అన్నారు. మొదటిలో అమాయకంగా ఉన్న అమ్మాయిగా చూపించి క్లైమాక్స్‌లో విశ్వరూపం చూపించారని అన్నారు.


నాకు ఈ సినిమా చూస్తే విజయశాంతి కర్తవ్యం గుర్తుకు వచ్చిందని , కర్తవ్యం సినిమా వచ్చినా సమయంలో ఇలాంటి కథతో విజయశాంతి ఒక సినిమాను చేస్తే చాలా బాగుండేదని అభిప్రాయాన్ని తెలిపారు. ఎలాంటి పాత్రలను విజయశాంతి అంతా అలవోకగా చేయగలరని.. ఈ కథ ఆమెకు చాలా బాగా కుదిరేదని తెలిపారు. ఇక సినిమాలో మురళీ శర్మ నెగటివ్‌ పాత్ర చేసినా ఎక్కడా దొరకకుండా చాలా బాగా నటించారు. రావు రమేశ్‌ది చిన్నపాత్ర అయినా చక్కగా నటించారన్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ను చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు ఎంత బాగా నటించి చిత్రానికి ప్రాణం పోశారని చెప్పుకొచ్చారు.