లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగని కెసిఆర్ కుటుంబ సభ్యులు!

KCR family members who did not contest the Lok Sabha elections

హైదరాబాద్‌ః తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. లోక్ సభ ఎన్నికలకు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కుటుంబం పూర్తిగా దూరంగా ఉంది. 23 ఏళ్ల క్రితం కొందరు నేతలతో కలిసి టీఆర్ఎస్ పార్టీని కెసిఆర్ స్థాపించారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో కెసిఆర్ కుటుంబం పోటీ చేస్తూనే ఉంది. కెసిఆర్, కెటిఆర్, హరీశ్ రావు, కవితల్లో ఎవరో ఒకరు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే, ఈ సారి మాత్రం వారి కుటుంబం నుంచి ఒక్కరు కూడా పోటీ చేయడం లేదు. లోక్ సభ ఎన్నికల్లో కెటిఆర్ లేదా హరీశ్ రావు పోటీ చేయవచ్చనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. కానీ, వీరిద్దరిలో ఎవరూ బరిలోకి దిగలేదు. లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.