స్పెయిన్‌లో లాక్‌డౌన్‌పై పాక్షిక సడలింపు

ఉత్పత్తి, నిర్మాణ రంగాల్లో పరిశ్రమలు తెరుచుకునేందకు అనుమతి

spain
spain

స్పెయిన్‌: గత కొద్ది రోజులుగా కరోనాతో విలవిలలాడుతూ ఉన్న స్పెయిన్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో స్పెయిన్‌ ప్రభుత్వం దేశంలో విధించిన లాక్‌డౌన్‌ను పాక్షికంగా సడలించింది. నిర్మాణ, ఉత్పత్తి రంగాల్లో పరిశ్రమలు తెరుచుకునేందుకు, కార్మికులు పనులకు వెళ్లేందుకు అనుమతిచ్చారు. కాని మిగతా వాటిపై ఆంక్షలను ఈ నెల 26 వరకు కఠినంగా కోనసాగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా స్పెయిన్‌లో ఇప్పటివరకు 1.69 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 17, 489 మంది మరణించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/