సినీ పరిశ్రమకు ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ఇవ్వాలి

సినీ పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు కుట్ర

Jaya Bachchan

న్యూఢిల్లీ: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాన్ని ఎంపి జ‌యాబ‌చ్చ‌న్ ఈరోజు రాజ్యసభలో మాట్లాడారు. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాన్ని అడ్డుపెట్టుకుని సినీ పరిశ్రమను త‌ప్పుప‌ట్ట‌డం స‌రికాదని చెప్పారు. సినీ పరిశ్రమకు ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆమె కోరారు. కొంద‌రు చేసిన తప్పుల కారణంగా సినీ పరిశ్రమ మొత్తంపై నిందలు వేయడం సరికాదని చెప్పారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు పొందిన న‌టులు భారత్‌లో ఉన్నారని ఆమె అన్నారు. లోక్‌స‌భ‌లో నిన్న సినీ పరిశ్రమ గురించి ఓ ఎంపీ ప్రతికూల వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. సినీ పరిశ్రమలో పని చేసిన ఆ వ్యక్తి అదే పరిశ్రమ గురించి అలా మాట్లాడ‌టం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు కుట్ర జ‌రుగుతోందని ఆమె అన్నారు. రాజ్యసభలో జీరో అవ‌ర్‌లో దీనిపై మాట్లాడాల‌ని కోరారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/