కరణం ధర్మశ్రీకి ప్రమోషన్ ఇచ్చిన జగన్

అనకాపల్లి జిల్లా చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ కి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రమోషన్ ఇచ్చారు. ఇటీవల మంత్రివర్గంలో స్థానం ఆశించినా దక్కకపోవడంతో అదే హోదాలో ఉండే పదవి ఇచ్చారు. కరణం ధర్మశ్రీ కి ప్రభుత్వ విప్‌ పదవి ఇచ్చారు. జీవో నంబర్ 67తో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి దక్కకపోవడంతో కరణం ధర్మశ్రీ ఆవేదన వ్యక్తం చేసారు. అయన అనుచరులు ఆందోళనలకు దిగారు.. రోడ్లపై టైర్లు కాల్చి నిరసన చేశారు. ఒకానొక సందర్భంలో ధర్మశ్రీ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆ తర్వాత విశాఖ పర్యటనకు వెళ్లిన జగన్‌.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే ఇప్పుడు ప్రభుత్వ విప్‌ పదవి కట్టబెట్టారు.

ధర్మశ్రీ బిఎ, బిఇడి, బిఎల్‌ పూర్తి చేసిన ఆయన 2004లో కాంగ్రెస్‌ తరపున మాడుగుల ఎమ్మెల్యేగా పోటీ చేశారు. టిడిపి తరపున బరిలో నిలిచిన మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణపై గెలుపొందారు. ఆ తరువాత అదే పార్టీ తరపున చోడవరం ఎమ్మెల్యేగా 2014లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరి, 2019లో చోడవరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.