అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు

Amaravati
Amaravati

అమరావతి: అమరావతి రాజధాని భూకుంభకోణం పై ఈరోజు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇన్‌సైడ్ ట్రేడింగ్‌పై పూర్తిస్థాయిలో ఏసీబీ పూర్తి స్థాయిలో విచారణకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ఏసీబీ పలు కీలక ఆధారాలను సేకరించినట్టు సమాచారం. అమరావతి భూములు విషయంలో పెద్ద కుంభకోణం జరిగిందని.. ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని అధికార వైఎస్‌ఆర్‌సిపి పదే పదే ఆరోపిస్తోంది. సిఎం జగన్ సైతం ఈ విషయంలో పలుసార్లు విమర్శలు చేశారు. దీనిపై విచారణ చేయాలని అధికార వైఎస్‌ఆర్‌సిపి పలుసార్లు డిమాండ్ కూడా చేసింది.

అయితే ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సిఎం జగన్ సర్కార్ నిర్ణయించింది. అయితే అమరావతిలో భూముల సమీకరణ విషయంలో స్కామ్ జరిగిందనే అంశాన్ని మాత్రం వైఎస్‌ఆర్‌సిపి ఇప్పటికీ ప్రస్తావించింది. ఈ క్రమంలో ఈ భూముల కుంభకోణం అంశంపై ఏసీబీ కేసు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ వైపు గత చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన కుంభకోణం అంశంపై ఏసీబీ కేసు నమోదు చేయాలని నిర్ణయించగా… చంద్రబాబు హయంలో జరిగిన అవినీతిపై పార్లమెంట్‌ వేదికగా గళం విప్పాలని నిర్ణయించారు. సీఆర్డీఏ అక్రమాలు, ఫైబర్ నెట్ అవినీతిపై సీబీఐ విచారణ కోరేందుకు సిద్ధమయ్యారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/