‘ఆస్కార్‌లో చరిత్ర సృష్టించిన ‘పారసైట్‌ ‘

Oscar Awards 2020 Event

ప్రపంచంలో అతిపెద్ద సినిమా పండుగ ఆస్కార్‌ అవార్డులు.. అమెరికా వేదికగా ఘనంగా జరుగుతోంది.. ప్రపంచ వ్యాప్తంగా వందలాది నటీనటులు, దర్శక,నిర్మాతలు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.. ఈసారి ఆస్కార్‌ వేడుకలో ఓ సంచలనం నమోదైంది.. ఆంగ్లేతర సినిమా మెయిర్‌ కేటగిరీ చరిత్రలో తొలిసారి బెస్ట్‌మూవీ అవార్డు దక్కించుకుంది.. దక్షిణకొరియాకు చెందిన ‘పారసైట్‌ మూవీ జనరల్‌ కేటగిరీలో బెస్ట్‌ పిక్చర్‌ అవార్డు అందుకుంది.. మొదటిసారి కొరియన్‌ మూవీ ఫారిన్‌ కేటగిరీలో కాకుండా మెయిన్‌ కేటగిరీలో అవార్డు పొందటం విశేషం.కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈచిత్రాన్ని దర్శకుడు బోన్గ్‌ జోన్‌ హూ తెరకెక్కించారు. అంతేకాదు ఆయన కూడ బెస్ట్‌ డైరెక్టర కేటగిరీలో అవార్డు అందుకున్నారు.. అందరూ ఊహించినట్టే ‘జోకర్‌ సినిమాలో హీరోగా నటించిన జాక్విన్‌ ఫీనిక్‌్‌స బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు అందుకున్నారు. జీనీ జెల్‌ వెగ్గర్‌ బెస్ట్‌ యాక్ట్రెస్‌గా ‘జూడీ చిత్రానికి అవార్డు సొంతం చేసుకున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/