12, 13 తేదీల్లో కర్నూలు పర్యటన

Amarvati: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 12, 13 తేదీల్లో కర్నూలులో పర్యటించనున్నారు. పర్యటన వివరాలను ఆ పార్టీ ప్రకటించింది. విద్యార్థిని సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న కర్నూలులో నిర్వహించే ర్యాలీ, బహిరంగ సభలో పవన్ పాల్గొననున్నారు.
ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాజ్ విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకూ ర్యాలీ నిర్వహిస్తారని, ఈ ర్యాలీలో జనసేన నాయకులు, పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాలు పాల్గొంటాయని తెలిపారు. అనంతరం, కోట్ల కూడలిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు జనసేన పార్టీ పేర్కొంది. 13వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కర్నూలు, ఎమ్మిగనూరులో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడతారని జనసేన పార్టీ తెలిపింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/