రాజకీయాల్లో క్రిమినల్స్ ఉండకూడదనేదే నా ఆశయం – పవన్ కళ్యాణ్

రాజకీయాల్లో క్రిమినల్స్ ఉండకూడదనేదే తన ఆశయమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఫిక్స్ చేసుకున్నారు. కానీ వైజాగ్ ఎయిర్ పోర్ట్ జరిగిన ఘటన పవన్ పర్యటన కు ఇబ్బందిగా మారింది. ఎయిర్ పోర్ట్ ఘటన తో వైస్సార్సీపీ నేతలు జనసేన కార్య కర్తల ఫై కేసులు పెట్టడం , పవన్ పర్యటనకు కూడా పోలీసులు నోటీసులు చేయడం తో..నోవాటెల్ నిన్నంతా పవన్ నోవెటల్ కే పరిమితమయ్యారు.

ఈరోజు మధ్యాహ్నం వైజాగ్ నుండి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ కు చేరుకొని, మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. మీడియా సమావేశంలో పవన్ తో పాటు పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ నుంచే ఎక్కువ మంది ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ ఆ ప్రాంతం ఎందుకు వెనకబడి ఉందని పవన్ ప్రశ్నించారు. ఒక కుటుంబం చేతిలో అధికారం పెట్టుకొని వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారని, రాష్ట్రం బాగుపడాలంటే వైస్సార్సీపీ నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడం ఒకటే మార్గమన్నారు.

పోలీసు వ్యవస్థమీదకానీ, సిబ్బందిమీద కానీ తనకు ఎటువంటి కోపం లేదని, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు క్రిమినల్స్ కు సెల్యూట్ చేసే దారుణమైన వ్యవస్థ మనదని, రాజకీయాల్లో క్రిమినల్స్ ఉండకూడదనేదే తన ఆశయమన్నారు. అది జరగకపోతే ఏపీ ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుందన్నారు. వైస్సార్సీపీని గద్దె దించడమే లక్ష్యంగా జనసేన అడుగులు వేస్తుందన్నారు. వైస్సార్సీపీ విముక్త ఏపీ కోసమే ఎన్నికల్లో పోరాడతామన్నారు. తన విమర్శలు ఎప్పుడూ విధానపరంగానే ఉంటాయన్నారు. ‘విశాఖ గర్జన’ తర్వాత జనవాణిని ప్రకటించలేదని, వైస్సార్సీపీని ఇబ్బంది కలిగించడం జనసేన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు .