‘పక్కా కమర్షియల్’ ట్రైలర్ రిలీజ్

పక్కా కమర్షియల్ నుండి కమర్షియల్ ట్రైలర్ వచ్చి ఒక్కసారిగా సినిమా ఫై అంచనాలు పెంచేసింది. ప్ర‌తి రోజు పండ‌గే లాంటి మెగా హిట్ తర్వాత ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి నిర్మిస్తున్న ఈ మూవీ లో మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా నటిస్తుండగా రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్ట‌ర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్‌లో ఎప్పుడూ లేనంత కొత్త‌గా గోపీచంద్ చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నాడు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

జులై 01 న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో మేకర్స్ చిత్ర ట్రైలర్ ను బుధువారం విడుదల చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు. పాతికేళ్ల తర్వాత బ్లాక్ కోటు వేస్తున్నారంటే ఎంత ఎలివేషన్ ఉండాలి..’ అని రాశీ ఖన్నా చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. గోపీచంద్ ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్.. మారుతి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటుగా అన్ని కమర్షియల్ హంగులు జోడించి ‘పక్కా కమర్షియల్’ గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఈ ట్రైలర్ తెలియజేస్తోంది. ఇందులో గోపీచంద్ లాయర్ గా చాలా స్టైలిష్ గా కనిపిస్తుండగా, రాశీ ఖన్నా ఒక సీరియల్ ఆర్టిస్టుగా మరియు లాయర్ గా కనిపిస్తుంది. ఇక గోపీచంద్ తండ్రి పాత్రలో సత్యరాజ్ నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. ఓవరాల్ గా ట్రైలర్ చూస్తుంటే మారుతీ మార్క్ కమర్షియల్ కనిపిస్తుంది. మరి సినిమా ఎలా ఉందనేది తెలియాలంటే మరో రోజు ఆగాల్సిందే.

YouTube video