కొత్త డీజీపీ గా అంజనీకుమార్ ..?

కొత్త డీజీపీ గా అంజనీకుమార్ బాధ్యతలు చేపట్టబోతున్నారా..? ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తుంది. తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం మహేందర్ రెడ్డి ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. 1986 బ్యాచ్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఐపీఎస్ అధికారి ఆయన. 1995లో హైదరాబాద్ తూర్పు జోన్ డీసీపీగా, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీగా వ్యవహరించారు. అనంతరం ఇంటెలీజెన్స్ చీఫ్, గ్రేహౌండ్స్ ఐజీగా పలు జిల్లాల్లో వివిధ హోదాల్లో పని చేశారాయన.

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌‌ గా వ్యవహరించారు. 2017 నవంబర్ లో ఇన్‌చార్జ్ డీజీపీగా బాధ్యతలను స్వీకరించారు. 2018 ఏప్రిల్ లో పూర్తి స్థాయి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ నియమితులయ్యారు. కాగా ఇప్పుడు మహేందర్ రెడ్డి పదవి విరమణ నేపథ్యంలో ఆయన స్థానంలో అంజనీ కుమార్ ని నియమించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. 1990 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అంజనీ కుమార్ ప్రస్తుతం ఆయన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, అవినీతి నిరోధక విభాగాధిపతిగా ఉంటోన్నారు. గతంలో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా పని చేసిన అనుభవం ఉంది. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగానూ సేవలను అందించారు.