జులై 01 నుండి ఓటిటి లో ప్రసారం కాబోతున్న విరాటపర్వం

ఓటిటిలు వచ్చినప్పటి నుండి చిన్న , పెద్ద అనే తేడాలు లేకుండా ఏ సినేమైనా రిలీజ్ అయినా రెండు వారాల్లోపే ఓటిటి లో ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో థియేటర్స్ కు వెళ్లి వందలు ఖర్చు చేసే బదులు హ్యాపీ గా ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇదిలా ఉంటె తాజాగా రానా-సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం మూవీ జులై 01 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

వేణు ఉడుగుల ఈ చిత్రానికి డైరెక్ట్ చేయగా , సురేష్ ప్రొడక్షన్స్, ఎల్ఎస్వీ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. నక్సలిజం, ప్రేమ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకుంది. ఈ తరుణంలో ఈ సినిమాను ఓటిటి లో ప్రసారం చేసేందుకు నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్ర ఓటిటి రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ వారు జులై 1 నుండి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారికంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. తెలుగు, మలయాళం, తమిళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుందని వెల్లడించింది. థియెటర్ లో రిలీజైన 15 రోజులకే ఈ మూవీ ఓటీటీలోకి వస్తుండడం విశేషం. కాగా ఈ సినిమాలో రవన్నగా రానా, వెన్నెలగా సాయిపల్లవి నటించగా, ప్రియమణి, నందాతా దాస్‌, ఈశ్వరీరావు, జరీనా కీలక పాత్రలు పోషించారు.

ఇదిలా ఉంటె తాజాగా టాలీవుడ్ నిర్మాతలు ఓ నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతే సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్​ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి ఒప్పందాలు చేసుకునే సినిమాలకు ఈ నిబంధన వర్తించనుందని వారు తెలిపారు. భారీ బడ్జెట్‌ చిత్రాల నుంచి చిన్న సినిమాల వరకు అన్నీ విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలోకి వస్తుండటం థియేటర్ల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని పలువురు నిర్మాతలు వాపోయారు. అలాగే హీరోల క్రేజ్‌ తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై చర్చలు జరిపిన నిర్మాతలు బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీలోనే ఓటీటీ రిలీజ్​పై నిర్ణయం తీసుకున్నారు.