పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దుబాయ్‌లోని ఓ హాస్పటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. 1943 ఆగస్టు 11న ఢిల్లీలో ముషారఫ్ జన్మించారు. దేశ విభజన తర్వాత కుటుంబంతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత సైన్యంలో చేరి దశలవారీగా దేశాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు.

2001 నుంచి 2008 వరకు దేశాధ్యక్షుడిగా పనిచేశారు. అయితే అభిశంసను తప్పించుకునేందుకు తన పదవికి రాజీనామా చేశారు. కాగా, 2014 మార్చి 31న దేశద్రోహం కేసులో ఆయనను ఇస్లాబాద్‌లోని ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. దేశద్రోహం నేరం కింద మరణశిక్ష విధించింది. దీంతో అరెస్టు చేస్తారనే భయంతో ఆయన దుబాయ్‌ పారిపోయారు. మార్చి 2016 నుంచి దుబాయ్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు