హఫీజ్‌ సయీద్‌ అనుచరులకు 16 ఏండ్ల జైలు

hafiz saeed
hafiz saeed

లాహోర్‌: 2008 నాటి ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు చెందిన ముగ్గురు అనుచరులకు పాకిస్థాన్‌లోని లాహోర్‌ ఉగ్రవాద వ్యతిరేక శిక్ష విధించింది. నిందితుల్లో ఇద్ద‌రు జాఫ‌ర్ ఇక్బాల్, హ‌ఫీజ్ అబ్ద‌స్ స‌లామ్ బిన్ అహ్మ‌ద్‌ల‌కు 16.5 ఏండ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం శుక్రవారం తీర్పు చెప్పింది. ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల జరిమానా కూడా విధించింది. మ‌రో ముద్దాయి, సయీద్‌ బావమరిది హఫీజ్‌ అబ్దుల్‌ రెహ్మన్‌ మక్కీకి ఏడాదిన్నర జైలుశిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఉగ్రవాదులకు నిధులు అందించిన మ‌రో కేసులో జాఫ‌ర్ ఇక్బాల్, హ‌ఫీజ్ అబ్ద‌స్ స‌లామ్ బిన్ అహ్మ‌ద్‌ రెండు వారా‌ల క్రిత‌మే బెయిల్‌పై విడుద‌ల‌య్యారు. వీరంతా జ‌మాత్ ఉద్ ద‌వా (జేయూడీ)కి చెందిన సీనియ‌ర్ నేత‌లు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/