ఎమ్మెల్సీగా సంతృప్తి లేదని తెలిపిన పాడి కౌశిక్ రెడ్డి

ఎమ్మెల్సీగా సంతృప్తి లేదని తెలిపాడు పాడి కౌశిక్ రెడ్డి. వీణవంక మండలం కొండపాక గ్రామంలో కొత్త గ్రామ పంచాయతి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎమ్మెల్సీగా సంతృప్తి లేదని, వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను బరిలో ఉంటానని తెలిపారు. ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల సమస్యలు తీరుస్తానని చెప్ప్పుకొచ్చారు.

అంతకు ముందు హనుమకొండ జిల్లా కమలాపురంలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.. కల్యాణ లక్ష్మీ చెక్కులు వచ్చాయని సమాచారం ఇచ్చినా.. కొంత మంది లబ్ధిదారులు కార్యక్రమానికి రాలేదని అసహనం వ్యక్తం చేశారు. హాజరుకాని వారికి చెక్కులు క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు. అన్ని పథకాలు తీసుకుంటారు కానీ.. టీఆర్ఎస్ కు మాత్రం ఓటేయ్యరు అంటూ లబ్ధిదారులపై మండిపడ్డారు.