పల్స్‌ ఆక్సిమీటర్‌తో ఆక్సిజన్‌ స్థాయి గుర్తింపు

మాస్క్‌ వాడకంలో నిర్లక్ష్యం వద్దు

pulse oximeter
pulse oximeter

కోవిడ్‌ ముఖ్యంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో మన శరీరంలో ఆక్సిజన్‌స్థాయి పల్స్‌ ఆక్సిమీటర్‌ ద్వారా తెలుసుకోవటం ద్వారా కోవిడ్‌ వ్యాప్తిస్థాయి, ఊపిరితిత్తులకు వేరే వ్యాధికి ఉందా? అనేది తెలుసుకోవచ్చు.

శరీరంలో ఎస్‌పిఒ2 లెవెల్‌ ఆక్సిజన్‌స్థాయి ఎంత ఉందో తెలుసుకవోటం పల్స్‌ ఆక్సిమీటర్‌ ద్వారా ఎంతో సులభం .వీటిని ప్రతి ఇంటిలో ఉంచుకోవటం మంచిది. పల్స్‌ ఆక్సిమీటర్‌ ద్వారా శరీరంలో ఆక్సిజన్‌స్థాయి , పల్స్‌రేటును తెలుసుకోవచ్చు. 94 నుండి 100 శాతం ఉండి పల్స్‌రేటు 60 నుంచి 100 శాతం వరకు ఉంటే సాధారణ పరిస్థితి ఉన్నట్టే.

94 నుండి 100 శాతం ఉండి పల్స్‌రేటు 60 నుంచి 100 శాతం వరకు ఉంటే సాధారణ పరిస్థితి ఉన్నట్టే అని అన్నారు. .80శాతం కన్నా తక్కువ ఉంటే ప్రమాదకర పరిస్థితి ఉంటుందని, 88 నుంచి 94 శాతం లోపు ఉంటే కరోనా పరీక్షలు నిర్వహించుకోవాల్సిన అవసరం వుంది.

ఎస్‌95 మాస్కులు వైద్యులు, ఇతర వైద్యసిబ్బంది ధరిస్తే సరిపోతుందని, అందరూ వాటిని వినియోగించాల్సిన అవసరం అంతగా లేదు. మాట్లాడేటపుడు కచ్చితంగా మాస్క్‌ ధరించాలి.

విజయవాడ్త: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మాస్క్‌ ధరించటంలో, ఆక్సిజన్‌స్తాయి తెలుసుకోవటంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ అన్నారు.

మాస్క్‌ ధరించటంతో అనుసరించాల్సిన అంశాలను, ఆక్సిజన్‌స్థాయి (శ్వాస పరిస్థితి)ని పల్స్‌ ఆక్సిమీటర్‌ ద్వారా కొలిచే విధానాలపై ప్రజలు అవగాహన కల్గించేందుకు అందుకు సంబంధించిన విషయాలను ఆయన ఆదివారం వెల్లడించారు.

కోవిడ్‌ ముఖ్యంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో మన శరీరంలో ఆక్సిజన్‌ స్థాయి పల్స్‌ ఆక్సిమీటర్‌ ద్వారా తెలుసుకొనుట ద్వారా కోవిడ్‌ వ్యాప్తిస్థాయి, ఊపిరితిత్తులు వేరే వ్యాధికి ఉందా అని తెలుసుకోవచ్చన్నారు..

శరీరంలో ఎస్‌పిఒ2 లెవెల్‌ ఆక్సిజన్‌స్థాయి ఎంత ఉందో తెలుసుకవోటం పల్స్‌ ఆక్సిమీటర్‌ ద్వారా ఎంతో సులభం అన్నారు. వీటిని ప్రతి ఇంటిలో ఉంచుకోవటం మంచిదన్నారు.

పల్స్‌ ఆక్సిమీటర్‌ ద్వారా శరీరంలో ఆక్సిజన్‌స్థాయి , పల్స్‌రేటును తెలుసుకోవచ్చన్నారు..

అదేవిధంగా 6 నిముషాలపాటు వాక్‌టెస్ట్‌ ద్వారా కూడ శ్వాసకోస పరిస్థితిని తెలుసుకోవచ్చన్నారు.

6 నిముషాలు సాధారణ ఆరోగ్యవంతులు నడిస్తే సమారు 400 నుంచి 700 మీటర్ల నడక చేయవచ్చన్నారు..

ఆ నడక చేసిన తర్వాత పల్స్‌ ఆక్సిజన్‌ మీటర్‌ ద్వారా పరీక్షల నిర్వహించుకుంటే గతంలో వచ్చిన రీడింగ్‌ కంటే 4 అంకెలు తక్కువ నమోదు అయితే ఆందోళన కరంగా భావించవచ్చన్నారు.

Use of the mask

ఊపిరితిత్తుల సామర్ధ్య పరిస్థితి పల్స్‌ ఆక్సిమీటర్‌ ద్వారా 88 నుంచి94 శాతం ఆక్సిజన్‌స్తాయి ఉంటే కరోనా పరీక్షలు నిర్వహించుకుని వైద్యుల సలహా తీసుకోవాలన్నారు..

మాస్కుల ధారణలో చాలామంది రకరకాలుగా ధరించటం జరుగుతోందని, వాటిలో ముక్కుకు కిందకు పెట్టుకోవటం , లేదా గడ్డం కిందకు లాగటం , ముఖంపైకి లాగటం వంటి పనులు చేస్తున్నారని, అది సరికాదన్నారు.

అలాగే మాస్క్‌ ముందుభాగాన్ని చేతులతో ముట్టుకోవటం కూడ చేయకూడదన్నారు.

మాస్క్‌ ధరించేటపుడు తీసేటపుడు మాస్క్‌ చివరి అంచును పట్టుకుని తీయటం ఉత్తమం అన్నారు. ఎయిర్‌ఫిల్టర్‌ ఉన్న మాస్కులు ధరించటం వల్ల శ్రేయస్కరం కాదని వైద్యనిపుణులు చెబుతున్నారన్నారు.

ఎస్‌95 మాస్కులు వైద్యులు, ఇతర వైద్యసిబ్బంది ధరిస్తే సరిపోతుందని, అందరూ వాటిని వినియోగించాల్సిన అవసరం అంతగా లేదన్నారు.

మాట్లాడేటపుడు కచ్చితంగా మాస్క్‌ ధరించాలని, ఎదుటివారితో సంభాషించేటపుడు తప్పనిసరిగా కనీసం రెండు మీటర్ల భౌతికదూరం పాటించాలన్నారు

తాజా క్రీడా వార్తల కోసం:. https://www.vaartha.com/news/sports/