కృష్ణా జిజిహెచ్‌ కోవిడ్‌ ఆసుపత్రిలో 790 పడకలు

వైద్యపరంగా మౌలికసదుపాయాలు

covid care centres
covid care centres

విజయవాడ : కోవిడ్‌ ఆసుపత్రుల్లో కరోనా వైద్యం అందాలని ఆ దిశగా అదనంగా వైద్యపరమైన మౌలికసదుపాయాలు వైద్య సిబ్బందిని నియమిస్తామని జిల్లా కలెక్టర్‌ ఎఎండి ఇంతియాజ్‌ అన్నారు..

ప్రస్తుతం పరిస్థితిని కలెక్టర్‌ సమీక్షించారు.. ఈసంద ర్భంగా ఇంతియాజ్‌ మాట్లాడుతూ, జిజిహెచ్‌ కోవిడ్‌ ఆసుపత్రుల్లో 790 బెడ్లు, పిన్నమపేని ఆసుపత్రిలో 600 బెడ్లు, నిఘ్రా ఆసుపత్రిలో 500 బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు..

ఆసుపత్రిసామర్ధ్యానికి అనుగుణ:గా పాజిటివ్‌ పేషెంట్లను చేర్చుకుని వైద్యసహాయం అందించాలన్నారు. ఆసుపత్రుల్లో అవసరం మేరకు ఆక్సిజన్‌ అందుబాటులో ఉందని, ఇంకా అవసరమైతే ఆక్సిజన్‌ కెపాసిటీని పెంచుకోవాలని కలెక్టర్‌ అన్నారు.

అవసరమైన మేరకు వెంటిలేటర్స్‌ అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడ కోవిడ్‌ సేవలు అందిస్తున్నామని అన్నారు. ఆయుష్‌ ఆసుపత్రి,రమేష్‌ ఆసుపత్రి, ఆంధ్ర ఆసుపత్రి, లెడర్టీ ఆసుపత్రి కోవిడ్‌ లైన్‌ ఆసుపత్రులుగా పనిచేస్తున్నాయని అదనంగా అనూ ఆసుపత్రి , కామినేని ఆసుపత్రులను కూడ గుర్తించామని కలెక్టర్‌ అన్నారు.

సమావేశంలో జెసి డాక్టర్‌ కె.మాధవీలత, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఐ.రమేష్‌, జిజిహెచ్‌ సూపరింటెండ్‌ డాక్టర్‌ నాంచారయ, ప్రభుత్వ , ప్రైవేటు కోవిడ్‌ ఆసుపత్రుల నిర్వాహకులు, డాక్టర్లు పాల్గొన్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/