అగ్నిప్రమాద ఘటనపై విచారణకు ఆదేశం
మంత్రి మేకతోటి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి

Amaravati: విజయవాడ స్వర్ణ ప్యాలస్ అగ్ని ప్రమాద ఘటన పై హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్ ను ఓ ప్రైవేట్ ఆసుపత్రి వారు అద్దెకు తీసుకొని కరోనా కేర్ సెంటర్ గా వినియోగిస్తునట్టు ఆమె తెలిపారు.
ఈ కరోనా కేర్ సెంటర్ లో 40 మంది కరోనా భాదితులు, 10 మంది వైద్య సిబ్బంది ఉన్నట్లు సమాచారం వుందని ఆమె చెప్పారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/