లంచ్‌బాక్స్ భద్రంగా…
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ

కొవిడ్-19 ప్రభావం లంచ్‌బాక్స్‌ల మీదా పడింది. ఆఫీసుల్లో ఉద్యోగులు, లంచ్ బాక్స్‌ని మార్చుకుని రుచి చూసే సంస్కృతికి కాలం చెల్లిపోయింది. వైరస్ సోకే వీలు లేని లంచ్ ఏర్పాట్లే అంతటా!
ఈ కొత్త సంస్కృతిలో భాగంగా.. పెద్ద పెద్ద ఆఫీసుల్లో భోజనాన్నీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఆధారంగానే నడస్తున్నాయి. ఉద్యోగులు భద్రతే ప్రధానంగా సాగుతున్న ఈ నూతన ధోరణి విశేషలు ఇవి..
వర్చ్యువల్ పార్టీ! ఆఫీసుల్లో ఉద్యోగులందరూ గుంపులుగా చేరి, సరదాగా పార్టీ చేసుకునే పరిస్థితి లేదు. అయితే ఆ సరదాలను వదులుకోవడం ఇష్టంలేని సంస్థలు ప్రత్యామ్నాయాల కోసం వెతుకు లాట మొదలుపెట్టాయి.
ఒక ఫుడ్ డెలివరీ సంస్థ. ఓ వినూత్న ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసు కొచ్చింది. ఉద్యోగులందరూ వర్చ్యువల్‌గా కలిసి పార్టీ చేసుకునే సౌల భ్యాన్ని కలిగిస్తోంది.
ఇందుకోసం ‘దివర్క్ కెఫ్ డాట్ కామ్ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో ఉద్యోగుల డాటా బేస్ అప్‌డేట్ చేస్తే చాలు. ఆ సంస్థ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగులకు, ఇటు ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్‌చేస్తున్న ఉద్యోగులకు ఒకే సమయంలో పిజ్ఞాలను డెలివరీ చేస్తుంది.
డెలివరీ చేసే ఆహారంతో పాటు, అందంచే బిల్‌లో, పదార్థాలను తయారుచేసే పనివాళ్ల ఆరోగ్య హమీ పత్రం వివరాలు కూడా ఉంటాయి. వైరస్ అంటుకునే వీలు లేకుండా పదార్థాలను అల్ట్రా వయొలెట్ బాక్స్‌లో డెలివరీ చేస్తారు.
అంతటా మిషన్లే!
వంటకు ముందు కూరగాయలను కడగడం, తరగడం లాంటి పనులకూ మిషన్లనే వాడుతోంది
ఈ విధంగా మాం సాహా, శాకాహార వంటవాళ్లు పరిధు లకు కట్టుబడి కదులుతూ ఉం టారు. కాబట్టి పదార్థాలు కలిసి పోయే సమస్యా ఉండకుండా ఈ సంస్థ జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాగే పదార్థా లను బయోడగ్రేడబుల్ పైపొరతో ప్యాక్ చేస్తోంది.
‘ఈట్ ఫిట్ అనే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ. ఇందుకోసం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఒ.టి) అనే పరికరాలు, వైర్‌లెన్ సెన్సర్లను కూడా వాడుతోంది. వైర్‌లస్ సెన్సార్లు, వంట సిబ్బంది ధరించే రంగు టోపీలను గుర్తించి, వారి కదలికలను నమోదు చేస్తూ ఉంటాయి.
పి.పి.ఇ. సూట్లలో.. ఆఫీసు ల్లోని ప్యాంట్రీ సేవలు కూడా ‘కొవిడ్- 19కు తగ్గట్టు రూపం మార్చుకుంటు న్నాయి. దానిలో పని చేసే ఉద్యోగులు యూనిఫామ్‌ల పైన పి.పి.ఇ. సైట్లను ధరిస్తున్నారు.
అలాగే కొన్ని సంస్థల్లో ప్యాంరటీ సర్వీసుల నుంచి కాఫీ, టీలు తయారుచేసే బెవరేజ్ మిషన్లను తొలగించారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/