తుంగభద్రకు కొనసాగుతున్న వరద

Tungabhadra dam
Tungabhadra dam

గద్వాల : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద  కొనసాగుతోంది. దీంతో టీబీ డ్యాంలో నీటి మట్టం పెరుగుతుంది. ఎగువన  కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రవహిస్తోంది. మంగళవారం టీబీ డ్యాంకు 98,916 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో 9,218 క్యూసెక్కులు నమోదైంది. ప్రస్తుతం డ్యాంలో 80.172 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ప్రస్తుతం 1627.23 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. తుంగ డ్యాం నుంచి 24,660 క్యూసెక్కుల వరద టీబీ డ్యాంకు చేరుతుందని పేర్కొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/