నేడు అమెరికా పర్యటనకు మంత్రి కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు అమెరికాకు వెళ్లారు. ఇవాళ్టి నుంచి దాదాపు వారం రోజుల పాటు అమెరికాలో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టించ‌నున్నారు. తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగనుంది. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించనున్నారు. ఈ నెల 29 వ‌ర‌కు సాగే అమెరికా పర్య‌ట‌న‌లో వివిధ కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు.

కేటీఆర్ తాజా పర్యటనలో పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు. తెలంగాణలో పెట్టుబ‌డులు పెట్టాలని వారిని ఆహ్వానించ‌నున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాసాంధ్రులతో ప్రత్యేక స‌మావేశాల‌లో పాల్గొంటారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో కేటీఆర్ వెంట‌.. ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్ తో పాటు లైఫ్ సైన్సెస్ డైరెక్ట‌ర్ శ‌క్తి నాగ‌ర‌ప్ప‌న్, ఎల‌క్ట్రానిక‌స్ సుజ‌య్ కారంపూరితో పాటు ప‌లువురు ఉన్నారు.

కాగా, దేశంలోనే వేగంగా అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణ దూసుకుపోతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో మ‌రిన్ని పెట్టుబ‌డులు సాధించ‌డంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా మంత్రి కేటీఆర్ అమెరికా వెళ్లారు. అక్కడ ఎన్‌ఆర్‌ఐలు, పలు పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. ఇప్పటికే పెట్టబడులకు హబ్‌గా తెలంగాణ మారింది. అంతర్జాతీయ కంపెనీలు తమ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయి. అమెజాన్, ఫేస్‌బుక్‌, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ సంస్థలు హైద‌రాబాద్‌ను త‌మ వ్యాపార విస్తరణకు కేంద్రంగా మార్చుకున్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/