యాదాద్రిలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

యాదాద్రి: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 10న ఎదుర్కోలు, 11న బాలాలయంలో తిరుకళ్యాణం, 12న రథోత్సవం నిర్వహించనున్నారు. 14న అష్టోత్తర శత ఘటాభిషేకంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/