అమెరికాలో కాల్పులు..ఒకరి మృతి

విస్కాన్సిన్‌: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. విస్కాన్సిన్‌లోని ఓ మాల్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. గ్రాండ్ చ్యూట్‌లోని ఫాక్స్ రివర్ మాల్‌లో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల(అమెరికా కాలమానం ప్రకారం) ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన అనంతరం పోలీసులు మాల్‌కు వచ్చేలోపు దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడని గ్రాండ్ చ్యూట్‌ పోలీస్ ఆఫీసర్ ట్రావిస్ వాస్ తెలిపారు. కాల్పులకు తెగబడిన అగంతకుడి కోసం ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వాస్ వెల్లడించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/