కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన ఉత్తమ్‌

బిజెపి తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసింది..ఉత్తమ్‌

హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌ అనంతనరం టీపీసీసీ తాత్కాలిక అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేవలం ఎన్నికలున్న రాష్ట్రాల బడ్జెట్‌లా ఉంది తప్ప, మిగిలిన రాష్ట్రాల బడ్జెట్ కాదని విమర్శించారు. 3 లక్షల కోట్ల రూపాయల దేశ ప్రజల బడ్జెట్‌ను కేవలం 5 రాష్ట్రాలకు ఇవ్వడం దారుణమన్నారు. బిజెపి తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసిందని ఆరోపించారు. తెలంగాణ బిజెపి ఎంపిల వల్ల ఎటువంటి లాభం లేదన్నారు. రాష్ట్ర ప్రతిపాదనలు ఒక్కటి కూడా బడ్జెట్‌లో ప్రస్తావన చేయలేదని విమర్శించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆరు సంవత్సరాలకు ప్యాకేజి ప్రకటించడం ప్రజలను మోసం చేయడమేనని ఉత్తమ్ విమర్శించారు. కనీస మద్దతు ధరపై కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావన లేదని, రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నా మేలు చేసే చర్యలు లేవన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందని కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రకటన పచ్చి అబద్ధమన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు నిధులు కేటాయించలేదని, భారతదేశాన్ని ఆర్థికంగా దివాలా తీసే విధంగా ప్రజల ఆస్తులను అమ్మడం, 12 లక్షల కోట్ల అప్పులు చేయడం వంటి చర్యలు చేపడుతున్నారని విమర్శించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/