తిరుమల నడక మార్గంలో మరో చిరుత..భయంతో వణుకుతున్న భక్తులు

నాల్గు రోజుల క్రితం అలిపిరి నడకదారి మార్గం ఏడో మైలు దగ్గర బాలుడిపై చిరుత దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి లో వెంటాడిన చిరుతను అటవీ అధికారులు పట్టుకొని భక్తులకు ఉపశమనం కల్పించారు. ఇక ఇప్పుడు మరో చిరుత కనిపించడం తో భక్తులను భయబ్రాంతులకు గురి చేస్తుంది. మొన్న చిన్న చిరుత పిల్ల కనిపిస్తే…ఇప్పుడు దాని తల్లి సంచరిస్తుందని అధికారులు గుర్తించారు.

దానిని ట్రాప్ చేసేందుకు నడక మార్గంలోని ఫారెస్ట్ లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గాలిగోపురం నుంచి నరసింహస్వామి ఆలయం వరకు 6 కిలోమీటర్ల వరకు చిరుత సంచారంపై నిఘా పెట్టారు. ఆపరేషన్ కంటిన్యూ చేయాలని టిటిడి ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు. తిరుమల నడకమార్గం అభయారణ్యంలో ఉందని… నడకదారి చుట్టూ కంచె, గోడ నిర్మాణం చేపట్టడం కుదరదని.. అటవీశాఖ నిర్ణయం తీసుకోవాలని ధర్మారెడ్డి తెలిపారు.