మరోసారి ఇప్పటం గ్రామానికి పవన్ కళ్యాణ్

Jana Sena chief Pawan Kalyan visits Ippatam village

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఇప్పటం గ్రామానికి రాబోతున్నారు. రీసెంట్ గా వైస్సార్సీపీ ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలోని కొంతమంది ఇళ్లను కూల్చేసిన సంగతి తెలిసిందే. జనసేన మీటింగ్ కు ఇప్పటం గ్రామస్థులు స్థలం ఇచ్చారనే కోపంతోనే వారి ఇళ్లను కూల్చేశారని జనసేన ఆరోపిస్తూ..ఇల్లు కోల్పోయిన వారికీ లక్ష రూపాయిలు ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ ప్రకటన ప్రకారం వారికీ నష్టపరిహారం ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటం కు వెళ్ళబోతున్నారు.

ఈ నెల 27వ తేదీన ఇప్పటం గ్రామంలో జనసేనాని పర్యటించనున్నారు.. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఒక ప్రకటన చేశాయి. ఇప్పటం గ్రామంలోని పర్యటించి అక్కడ ఇళ్లు కోల్పోయిన బాధితులను మళ్ళీ జనసేనాని పరామర్శించనున్నారు. రోడ్లు విస్తరణలో భాగంగా ప్రభుత్వం కూల్చివేసిన ఇళ్ల కు సంబంధించిన బాధితులను పరామర్శించి ఒకొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సాయం పవన్ స్వయంగా అందజేయనున్నారని పార్టీ వర్గాలు ప్రకటించాయి.